శేరిలింగంపల్లి, అక్టోబర్ 17 (నమస్తే శేరిలింగంపల్లి): ఈ నెల 18వ తేదీన నిర్వహించ తలపెట్టిన బంద్ ఫర్ జస్టిస్ ను సంపూర్ణంగా విజయవంతం చేయాలని శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సబ్బండ వర్గాలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో బిసి లకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బిసి జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు శేరిలింగంపల్లి బిసి జెఏసీ ఆధ్వర్యంలో బిసి సంఘాల నాయకులు చేపట్టబోయే ఆందోళన కార్యక్రమానికి సీనియర్ నాయకులు, మహిళలు, బీసీ జేఏసీ నాయకులు హాజరై జయప్రదం చేయాలని అన్నారు. ఈ సందర్భంగా ఉదంయం హెచ్‌సీయూ బస్ డిపో వద్ద బస్సులను అడ్డుకోవాలన్నారు. అనంతరం గుల్‌మోహర్ పార్క్ సిగ్నల్ వద్ద బంద్‌ను నిర్వహించాలని, లింగంపల్లి నుంచి బీహెచ్ఈఎల్ వరకు ర్యాలీ నిర్వహించి చౌరస్తాకు చేరుకోవాలన్నారు.






