నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గ ముస్లిం సోదర, సోదరీమణులందరికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్ పర్వదినం పురస్కరించుకుని హఫీజ్ పెట్ డివిజన్ కు చెందిన టీఆర్ఎస్ నాయకులు షేక్ జామీర్ లీమ్రా, షేక్ నజీర్ నివాసంలో జరిగిన బక్రీదు వేడుకలలో ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు బక్రీద్ పండగ చాలా పవిత్రమైన పండుగ అని అన్నారు. మత సామరస్యానికి ప్రతీక అని, త్యాగానికి ప్రతి రూపంగా నిలిచే ఈ పండుగ రోజున సమస్త మానవాళికి శాంతి చేకూరాలని అల్లాను ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో హఫీజ్ పెట్ డివిజన్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ గౌడ్, ఆనంద్ గౌడ్, మల్లేష్, శివ, విక్రమ్, అజార్, తదితరులు పాల్గొన్నారు.