ఆరంభంతోనే అలరించి‌న నృత్యకారిణి ప్రణయ

నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ లోని శిల్పకళా వేదికలో నాట్య గురువు పానూరు క్రాంతికిరణ్ సమక్షంలో ప్రణయ మొదటిసారిగా ప్రదర్శించిన నృత్యప్రదర్శన అందరిని మంత్రముగ్దులను చేసింది. శ్రీ సకల గణాధిపతి, హంసద్వని జతిస్వరం, పాహిమాం, శ్రీ రాజరాజేశ్వరo, అన్నమాచార్య కీర్తన, దశావతారాలు, తరంగం, థిల్లాన వంటి అంశాలను కన్నులకట్టినట్లు ప్రదర్శించింది. ఈ ప్రదర్శనకు నట్టువాంగం క్రాంతి కిరణ్, ఓకల్ మంత శ్రీనివాస్, మృదంగం నాగేశ్వరరావు, వయోలిన్ అనిల్ కుమార్, ఫ్లూట్ ఉమా వెంకటేశ్వర్లు, శ్రీదాచార్యులు అందించారు. ఈ అరంగేట్ర ప్రదర్శనకు పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీ రిటైర్డ్ ఫ్రొఫెసర్, ఉత్తమ ఆచార్య అవార్డు గ్రహీత డాక్టర్ భాగవతుల సేతురాం, ఆంధ్రనాట్యం ఎక్స్ పో నెంట్, సెంట్రల్ సంగీత నాటక అకాడమీ అవార్డ్ గ్రహీత కళా కృష్ణ తదితరులు హాజరై కళాకారిణి ప్రణయ ను అభినందించారు.

నృత్యప్రదర్శనతో అలరింపజేసిన ప్రణయ

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here