శేరిలింగంపల్లి, ఏప్రిల్ 5 (నమస్తే శేరిలింగంపల్లి): స్వాతంత్ర్య సమరయోధుడిగా, సంఘసంస్కర్తగా తన పరిపాలన దక్షతతో దేశానికి విశేష సేవలందించిన భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ 117వ జయంతి సందర్భంగా మాదాపూర్ డివిజన్ పరిధిలోని రాజారాం కాలనీలో సీనియర్ నాయకుడు రఘునాథ్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలలో సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డితో కలిసి ఆయన చిత్రపటానికి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్బంగా PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుడిగా ,సంఘ సంస్కర్తగా, తన పరిపాలన దక్షతతో అఖండ భారతావనికి విశేష సేవలందించిన భారత మాజీ ఉప ప్రధాని డా. బాబూ జగ్జీవన్ రామ్ గొప్ప దార్శనికుడు అని, ఆయన సేవలు దేశం కోసం పడిన తపన ఎంతో మందికి స్ఫూర్తి దాయకం అని అన్నారు. ఆత్మ విశ్వాసమే ఆయుధంగా దళితుల అభ్యున్నతి కోసం, అణగారిన వర్గాల కోసం నిత్యం పాటుపడిన మహానుభావుడని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.