శేరిలింగంపల్లి, ఏప్రిల్ 5 (నమస్తే శేరిలింగంపల్లి): స్వాతంత్ర సమరయోధుడు, సంఘసంస్కర్త , భారత మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకొని బీజేపీ నాయకుడు పవన్ కుమార్ ఆధ్వర్యంలో హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని ఇంజనీర్స్ ఎంక్లేవ్ లో అయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా హఫీజ్ పేట్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు కైతాపురం జితేందర్ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ మహోన్నత వ్యక్తిత్వం కలిగినవారని, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం తన జీవితాన్ని అర్పించిన మహానుభావుడు, గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు, పరిపాలన నిపుణుడని అన్నారు. జాతీయ నాయకుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా పనిచేస్తూ అణగారిన తరగతుల అభివృద్ధికి ఎనలేని సేవలు అందించారు, ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదులు వేశారు అని పేర్కొన్నాను. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకుడు బోయిని మహేష్ యాదవ్, జిల్లా అధికార ప్రతినిధి అజిత్ సేనాపతి, మాజీ కౌన్సిలర్ రమణయ్య, సీనియర్ నాయకులు శ్రీనివాస్ యాదవ్ , అశోక్ , రవి ముదిరాజు, పాలం శ్రీనివాస్ , రాజు ముదిరాజ్ ,నరసింహ యాదవ్ , నవీన్ తదితరులు పాల్గొన్నారు.