నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ హుడా కాలనీ ప్రధాన రహదారిలో నూతనంగా ఏర్పాటు చేసిన అయ్యప్ప ఆర్గానిక్ ఫ్రూట్స్ షాపును చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రెడ్డి రఘునాథ్ రెడ్డితో కలసి మాదాపూర్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వచ్ఛమైన, సేంద్రియ పండ్లు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని నిర్వాహకులను ప్రోత్సహించారు. హూడ కాలనీ పరిసర ప్రాంత వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ కుమార్, సీనియర్ పాత్రికేయులు, పుట్ట వినయకుమార్ గౌడ్, నిర్వాహకులు శ్రీను, కోటమ్మ, నాయకులు రమణరావు, సురేష్, వెంకటేశ్, మధు, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.