కూకట్‌పల్లి (నమస్తే శేరిలింగంపల్లి): కూకట్‌పల్లిలోని జేఎన్‌టీయూ కాన్ఫరెన్స్ హాల్‌లో మాదాపూర్ జోన్ పరిధిలోని 120 హోం గార్డులకు శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏడీసీపీ మాణిక్‌రాజ్, రిజర్వ్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ధనలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు హోం గార్డులకు పలు సూచనలు, సలహాలు చేశారు.

హోం గార్డులు నియమ నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలన్నారు. ప్రజలతో దురుసుగా ప్రవర్తించకూడదని, ఉన్నతాధికారుల యెడల మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని, సీనియర్ అధికారులు ఇచ్చే సలహాలు, సూచనలను పాటించాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో హోం గార్డులతోపాటు రైటర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.