తార్నాక (నమస్తే శేరిలింగంపల్లి): భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారత రత్న ఇవ్వాలని పీవీ నరసింహారావు జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ పిడిశెట్టి రాజు అన్నారు. శనివారం పీవీ శత జయంతి వేడుకలలో భాగంగా తార్నాక ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో పీవీ చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ దేశ ప్రజల కోసం ప్రధానిగా పీవీ ఎన్నో సంస్కరణలను ప్రవేశపెట్టి అమలు పరిచారని అన్నారు. అందువల్ల ఆయనకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే రేవు చిన్న ధనరాజ్, సామాజిక వేత్త వలస సుభాష్ చంద్రబోస్, బి. రవి తేజ గౌడ్, పి. ఆదిత్య, శ్యామ్ కుమార్, గౌటి మల్లేష్, పి. రాజు పాల్గొన్నారు.