నమస్తే శేరిలింగంపల్లి: ఆయువ్ స్టూడెంట్స్ యూత్ ఫౌండేషన్ స్థాపించిన నాటి నుంచి పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టి పేదలకు, అనాథలకు అండగా నిలిచిందని ఏఎస్ వై ఎఫ్ వ్యవస్థాపకులు రోహిత్ ముదిరాజ్ అన్నారు. ఏఎస్ వై ఎఫ్ స్థాపించి తొమ్మిదేళ్లు పూర్తి చేసుకొని పదో సంవత్సరం లోకి అడుగుపెడుతున్న శుభసందర్భంగా వ్యవస్థాపక దినోత్సవంతో పాటు ఫౌండేషన్ చైర్మన్ శ్యామ్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.
శ్యామ్ సమాధి వద్ద ఏఎస్ వై ఎఫ్ సభ్యులు నివాళి అర్పించారు. అనంతరం వృద్ధాశ్రమం లో వృద్ధులకు అన్నదానం చేశారు. మున్ముందు పేదల కోసం, పేద విద్యార్థుల కోసం మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తామని ఏఎస్ వై ఎఫ్ వ్యవస్థాపకులు రోహిత్ ముదిరాజ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులు జీవన్, జ్ఞానేశ్వర్, నందు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.