మిరియాల ప్రీతమ్ జన్మదిన వేడుకల్లో ఆరెక‌పూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, జూలై 19 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువైన యువ నాయకుడు మిరియాల ప్రీతమ్ జన్మదిన వేడుకల‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శేరిలింగంపల్లి పీఏసీ చైర్మన్, ఎమ్మెల్యే ఆరెక‌పూడి గాంధీ ముఖ్య అతిథిగా హాజరై మిరియాల ప్రీతమ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకల్లో పాల్గొన్న గాంధీ, మిరియాల ప్రీతమ్ ప్రజాసేవలో మరింత ముందుకు సాగుతూ ప్రజల ఆదరణను పొందాలని ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని మిరియాల ప్రీతమ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here