నమస్తే శేరిలింగంపల్లి: ఆలయాల అభివృద్ధికి ప్రతి ఒక్కరి కృషి తప్పనిసరిగా ఉండాలని, ఆధ్యాత్మికత చింతన అవసరమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని మియాపూర్ లో ఆలయ కర్త, టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బండి రమేష్ ఆధ్వర్యంలో శ్రీ హేమదుర్గామాత ఆలయ వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. బండి రమేష్ దంపతులు అమ్మవారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక
కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఆలయ వార్షికోత్సవంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, టీఆర్ఎస్ నాయకులు ఆరెకపూడి బాలకృష్ణ, దాసరి గోపి కృష్ణ, నాయుడు తదితరులు పాల్గొన్నారు.