నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ లారీ యజమానుల అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి స్థానిక కార్పొరేటర్ గంగాధర్‌రెడ్డి సైబరాబాద్ సీపీ సజ్జనార్‌ను బుదవారం మర్యాద పూర్వకంగా కలిశారు. లారి అసోసియేషన్ సభ్యుల సమస్యలను పరిష్కరించాలని సీపీని గంగాధర్‌రెడ్డి కోరారు. అదేవిధంగా ట్రాఫిక్ డీసీపీ విజయ్‌కుమార్, గచ్చిబౌలి ట్రాఫిక్ సీఐ నరసింహారావులకు కలిసి వినతి పత్రాలను అందజేశారు. కాగా పోలీసు ఉన్నతాధికారులు తమ విజ్ఞపాన పట్ల సానుకూలంగా స్పందించారని, సమస్యల పరిష్కారం దిశగా దృష్టి సారిస్తామని తెలిపినట్టు కార్పొరేటర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ లారీ అసోసియేషన్ ప్రతనిధులు పాల్గొన్నారు.