నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గం, నల్లగండ్ల అదేవిధంగా మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఖనామేట్, బాలాజి హిల్స్ ప్రాంతలలో ఏర్పాటుచేసిన అన్నపూర్ణ క్యాంటిన్‌లను స్థానిక కార్పొరేటర్లు వి.గంగాధర్‌రెడ్డి, ఉప్పలపాటి శ్రీకాంత్, నార్నె శ్రీనివాస రావు, మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబాలతో కలసి ప్రభుత్వ విప్ గాంధీ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితుల్లో పేదవాడి ఆకలి తీర్చడానికి అన్నపూర్ణ క్యాంటీన్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని అన్నారు. లాక్‌డౌన్ కారణంగా తిండికి ఇబ్బంది పడుతున్న పేదలను అన్నపూర్ణ క్యాంటీన్లు ఆకలి తీరుస్తున్నాయని అన్నారు. నగరంలో ఏర్పాటు చేసిన ‘అన్నపూర్ణ’ క్యాంటీన్లు లాక్‌డౌన్ పరిస్థితుల్లో పేదల కడుపు నింపుతున్నయని అన్నారు.

పేదలు ఆకలితో అలమటించొద్దనే ఏకైక ఉద్దేశంతో నగరంలో రాష్ట్ర ప్రభుత్వం అధనంగా అన్నపూర్ణ క్యాంటీన్లను ఏర్పాటు చేశారని అన్నారు. లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయే నిరుపేదలు ఈ అన్నపూర్ణ క్యాంటీన్ సేవలను సద్వినియోగ పర్చుకోవలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి సర్కిల్ ఉపవైధ్యాధికారి రవి, గ్రంథాలయాల సంస్థ డైరెక్టర్ గణేష్ ముదిరాజ్, మాదాపూర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, నాయకులు దారుగుపల్లి నరేష్, సంపత్ కుమార్, గుమ్మడి శ్రీనివాస్, రాంచందర్ ,సాయి కృష్ణ ముదిరాజ్, కృష్ణ యాదవ్, నరేంద్ర ముదిరాజ్, నరేంద్ర యాదవ్, దయాకర్ తదితరులు పాల్గొన్నారు.
