శేరిలింగంపల్లి, అక్టోబర్ 26 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వరద ముంపు సమస్య శాశ్వత పరిష్కారం దిశగా యుద్ధప్రతిపాదకన చేపడుతున్న బాక్స్ కల్వర్ట్ వరద నీటి కాల్వ నిర్మాణం పనులలో భాగంగా వెంకట్ రెడ్డి కాలనీలో జిహెచ్ఎంసీ అధికారులు ఈఈ దుర్గా ప్రసాద్, డీఈ ఆనంద్, ఏఈ భాస్కర్ లతో కలిసి శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. లింగంపల్లి అండర్ బ్రిడ్జి వరద నీటితో నిండి పోవడం వలన పరిసర ప్రాంత వాహనదారులకు, ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు.
ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా అండర్ బ్రిడ్జి నుండి వరద నీటి కాల్వ, బాక్స్ కల్వర్ట్ నిర్మాణం పనులు చేపడుతున్నామన్నారు. పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువవచ్చి ముంపు సమస్య పునరావృతం కాకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. బాక్స్ నాలా కల్వర్ట్ నిర్మాణంలో ఎవరు అపోహలకు లోనుకావద్దని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ గౌరవ అధ్యక్షుడు వీరేశం గౌడ్, లింగంపల్లి విలేజ్ ప్రెసిడెంట్ గడ్డం రవి యాదవ్, దేవులపల్లి శ్రీనివాస్, రాజా రెడ్డి, కృష్ణ రెడ్డి, సూర్యనారాయణ, వెంకట్ రెడ్డి, రాంచందర్, రవి, ప్రశాంత్ యాదవ్, అనిల్, హరీష్, స్థానిక వాసులు తదితరులు పాల్గొన్నారు.