చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. అంబేద్కర్ 64వ వర్ధంతి సందర్భంగా చందానగర్ డివిజన్ పరిధిలోని చందానగర్ ప్రధాన రహదారి పక్కన ఉన్న బాబా సాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ దళిత, బడుగు, బలహీన వర్గాల ఆశా జ్యోతి, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అని కొనియాడారు. మొదటి దళిత న్యాయవాది, ప్రపంచ మేథావి అని, ఆయన గొప్ప దార్శనికుడని, ఆయన సిద్ధాంతాలను పాటించాలని అన్నారు. ప్రజల క్షేమం కోసం నిరంతరాయంగా పని చేసిన గొప్ప మేథావని, ఈ రోజు మనం స్వేచ్ఛగా, సంక్షేమ ఫలాలు అనుభవిస్తున్నామంటే అది డాక్టర్ అంబేద్కర్ కృషి అని, ఆయన రాసిన రాజ్యాంగం నేడు మనకు దశ దిశ చూపిస్తుందని అన్నారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో చందానగర్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి, మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, మాజీ కౌన్సిలర్ రవీందర్ రావు, హఫీజ్‌పేట్ డివిజన్ తెరాస అధ్యక్షుడు బాలింగ్ గౌతం గౌడ్, తెరాస నాయకులు మిర్యాల రాఘవ రావు, పురుషోత్తం యాదవ్, మంద గడ్డ విమల్ కుమార్, దాసరి గోపి కృష్ణ, హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ కుమార్, వెంకటేశం ముదిరాజ్, దొంతి శేఖర్, కంది జ్ఞానేశ్వర్, పీవై రమేష్, ప్రవీణ్ పాల్గొన్నారు.