శేరిలింగంపల్లి, మార్చి 24 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు డివిజన్ పరిధిలో ఏర్పడిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, గ్రేటర్ హైదరాబాద్ స్టాండింగ్ కమిటీ సభ్యుడు వి.జగదీశ్వర్ గౌడ్ అన్నారు. హాఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని జనప్రియ 5th ఫేస్ అపార్ట్మెంట్ లో పర్యటించి, స్థానికంగా నెలకొన్న సమస్యలను పరిశీలించారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తుందని, శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ప్రతి డివిజన్‌ను అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తామని అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ తమ దృష్టికి వచ్చే మౌళిక వసతుల సమస్యలకు పరిష్కారం చూపుతామని, మౌలిక సదుపాయాల కోసం అహర్నిశలు కృషి చేస్తామని తెలిపారు.
హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని జనప్రియ అపార్ట్మెంట్ లో తెలంగాణ రాష్ట్ర లేబర్ సెల్ ఉపాధ్యక్షుడు నల్ల సంజీవ రెడ్డి, హెచ్.ఎం.డబ్లు.ఎస్.ఎస్.బి మేనేజర్ శ్రీధర్, స్థానిక ప్రజలతో కలిసి సమావేశం ఏర్పాటు చేసి కాలనీలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కాలనీలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మూర్తి, చిన్న బాబు, కోటేశ్వరరావు, అశోక్, జితేందర్ సింగ్, మహిళలు జ్యోతి రెడ్డి, సత్యలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.