శేరిలింగంపల్లి, నవంబర్ 17 (నమస్తే శేరిలింగంపల్లి): మల్కాజ్‌గిరి నియోజకవర్గం పరిధిలోని గౌతమ్‌నగర్ డివిజన్ పరిధిలో ఉన్న ఇందిరా నెహ్రూ కాలనీ బస్తీలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో కార్తీకమాసం కార్తీక సోమవారం సందర్భంగా హైదరాబాద్ డీఎస్‌పీ చింతపల్లి వంశీ మోహన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన తన సొంత ఖర్చులతో ఆలయ ధ్వజస్తంభం వద్ద ఆకాశ దీపాన్ని ఏర్పాటు చేయించారు. ఈ కార్యక్రమంలో పరిసర ప్రాంతాలకు చెందిన కాలనీవాసులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి ఆశీర్వాదం తీసుకున్నారు.






