బీసీలంద‌రూ ఏక‌తాటి పైకి వ‌చ్చి పోరాటం చేయాలి: బేరి రామచంద్ర యాదవ్

శేరిలింగంప‌ల్లి, ఫిబ్ర‌వ‌రి 14 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): బీసీ సాధికారిత సంఘం ఆధ్వర్యంలో కొండ దేవన్న అధ్యక్షతన సోమాజిగూడ ప్రెస్ క్ల‌బ్‌లో బీసీ కులాల సమగ్ర సర్వే పై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వ‌హించారు. కొండ దేవన్న అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ ముఖ్య అతిథిగా, జాతీయ బీసీ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం, ప్రముఖ జర్నలిస్ట్ తెలంగాణ విట్టల్, తెలంగాణ రాష్ట్ర ప్రముఖ నాయకుడు, సర్పంచిల సంఘం ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు భూమన యాదవ్, తెలంగాణ రాష్ట్ర ఐక్యవేదిక అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ బీసీలకు జరుగుతున్న అన్యాయంపై పోరాటం గురించి చర్చించి రాష్ట్రవ్యాప్తంగా బీసీ కులాలను కుల సంఘాలను అందరిని ఏకం చేసి ఐకమత్యంతో ప్రణాళిక బద్ధంగా పోరాటం చేద్దామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్ ఇస్తామని వాగ్దానం చేసి ఇప్పుడు మాట మార్చి కాంగ్రెస్ పార్టీలో 42 శాతం సీట్లు ఇస్తామనడం బీసీలకు అన్యాయం చేయడమే అన్నారు.

రాహుల్ గాంధీతో పాటు సోనియాగాంధీ ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా 42 శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని ఎన్నో సభలలో వాగ్దానం చేశార‌ని అన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% బీసీలకు రిజర్వ్ చేస్తూ అసెంబ్లీలో బిల్లు పెట్టి తీర్మానం చేయాల‌న్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించి జీవో జారీ చేయాల‌న్నారు. ఆ కాపీని కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంటుకు రాష్ట్రపతికి పంపించాలనికోరారు. అప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తాము నమ్ముతామ‌ని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సర్పంచిల‌ సంఘం అధ్యక్షుడు సౌదారి భూమన్న, అధ్యక్షుడు శంకర్, మహేందర్, తోట శ్రీనివాస్, బాలమణి, ఎం .లింగం, బీసీ ఐక్యవేదిక కార్యదర్శి, బత్తుల సిద్దేశ్వర, సతీష్, శ్రీనివాసరావు, బీసీ సంఘాల నాయకులు, అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here