శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 14 (నమస్తే శేరిలింగంపల్లి): షాబే ఈ బారాత్ పండుగ పర్వదినం సందర్బంగా కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ ఏ బ్లాకు, మార్తాండ్ నగర్, అంజయ్య నగర్, న్యూ పీజేఆర్ నగర్ లోని ముస్లిం శ్మశాన వాటికలలో జీహెచ్ఏంసీ సిబ్బందిచే కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ క్లీనింగ్ చేయించారు. పొదలు, ముళ్ళ కంపలు, ఎండిపోయిన చెట్లు, పాస్టిక్ వ్యర్ధాలను జేసీబీ సహాయంతో తొలగించారు. శానిటేషన్ సిబ్బంది సహాయంతో, స్థానిక నాయకులతో కలసి శ్మశాన వాటికలను శుభ్రం చేయించారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ హమీద్ పటేల్ మాట్లాడుతూ, సంవత్సరానికి ఒకసారి దేవుని వద్దకు చేరిన పెద్దలను తలుచుకుంటూ వారి కోసం ఉపవాస దీక్షలు చేయటం, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరటం కోసం ఒకరాత్రి మొత్తం ప్రత్యేక ప్రార్ధనలు చేయటం జరుగుతుందని అన్నారు.
వారిని ఎక్కడ పెట్టామో అక్కడ ఉన్న శ్మశాన వాటికకు వెళ్లి వారి సమాధులపై పూలు చల్లి, వారి ఆశీస్సులు తీసుకుని, ప్రత్యేకంగా వారిని స్మరించుకోవటం ఈ షాబే ఈ బారాత్ పండుగ ప్రత్యేకత అని కార్పొరేటర్ హమీద్ పటేల్ అన్నారు. ఈ కార్యక్రమంలో హమీద్ పటేల్ వెంట షేక్ ఇమామ్, సయ్యద్ ఉస్మాన్, షేక్ జాఫర్, సయ్యద్ హర్షద్, అబ్దుల్ వసీం, సంజు, సంతోష్, సల్మాన్, జహీర్ మూల సాబ్, పాషా భాయ్ తదితరులు ఉన్నారు.