హైదరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): నగరంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మద్యం షాపులు మూత పడనున్నాయి. డిసెంబర్ 1వ తేదీన పోలింగ్ ఉన్న కారణంగా నవంబర్ 29వ తేదీ సాయంత్రం 6 నుంచి డిసెంబర్ 1వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మద్యం షాపులను మూసివేయనుఉన్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 1వ తేదీన సాయంత్రం 6 గంటల తరువాత మద్యం షాపులను తెరుచుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది.