శేరిలింగంపల్లి, డిసెంబర్ 4 (నమస్తే శేరిలింగంపల్లి): రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మియాపూర్ విలేజ్ లో వశిష్ట కాలేజ్ పేరుతో కేవలం రెండు పర్మిషన్ ఉండగా సుమారు పది బిల్డింగ్‌లలో కనీసం బోర్డులు కూడా లేకుండా అక్రమంగా కాలేజీ నిర్వహిస్తున్నారు. కాబట్టి వాటిపై చర్య తీసుకోవాలని రంగారెడ్డి జిల్ల డిఐఈఓ వెంక్య నాయక్ కి ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎఫ్డీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పల్లె మురళి, గ్రేటర్ కన్వీనర్ ఎం. శ్రీకాంత్, సభ్యుడు అరుణ్ తదితరులు పాల్గొన్నారు.