శేరిలింగంపల్లి, డిసెంబర్ 4 (నమస్తే శేరిలింగంపల్లి): Hyderabada Rising ఉత్సవం కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికై H-CITI లో రూ.1606.00 కోట్ల నిధులతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ శంకుస్థాపన చేశారు. ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా Hyderabada Rising ఉత్సవంలో భాగంగా నెక్లెస్ రోడ్డు HMDA మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు వేంనరేందర్ రెడ్డి, శాసన మండలి చీఫ్ విప్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం, ఎమ్మెల్యే దానం నాగేందర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజల తరుపున ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియచేస్తున్నానని అన్నారు. ప్రజా పాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో అభివృద్ది, సంక్షేమంతో తెలంగాణ అభివృద్ధి పథంలో ముదుకుపోతుందని అన్నారు.