శేరిలింగంపల్లి, డిసెంబర్ 4 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ డివిజన్ పరిధిలోని హైటెక్స్ లో జరిగిన ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మూడవ వర్ధంతి కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా, మాజీ రాజ్య సభ సభ్యుడు టీ. జీ వెంకటేష్ గుప్తా, ఆంద్రప్రదేశ్ మాజీ మంత్రి వెంపల్లి శ్రీనివాస్ గుప్తా, మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా, తెలంగాణ ఆర్యవైశ్య మహా సభ అధ్యక్షుడు అమరవాది లక్ష్మి నారాయణ గుప్త, ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత, గంజి రాజమౌళి గుప్త, V B G రాజు గుప్త, యోగనంద్ గుప్త, మాజీ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా, ఆర్య వైశ్య కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని రోశయ్య చిత్రపటానికి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పుష్పాంజలి ఘటించారు.