శేరిలింగంపల్లి, జనవరి 18 (నమస్తే శేరిలింగంపల్లి): మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డా. నందమూరి తారక రామారావు 29 వ వర్థంతి సందర్భంగా హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని భాగ్యనగర్ కాలనీలో కార్పొరేటర్లు నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్ లతో కలిసి ఎన్‌టీఆర్ విగ్రహానికి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ తెలుగువారి గుండెల్లో చెరగని ముద్ర చిరస్థాయిగా వేసుకున్న నాయకుడు అని అన్నారు. విశ్వవిఖ్యాత, నటసార్వభౌమ, నటరత్న, పద్మ శ్రీ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డా. నందమూరి తారక రామారావు అన్న అనే పదానికి మారుపేరు అని, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అని భావించి ప్రజా సంక్షేమానికి సరికొత్త అర్థం చెప్పిన మహానుభావుడు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నందమూరి అభిమానులు , శ్రేయభిలాషులు, మిత్రులు, నాయకులు, కార్యకర్తలు , కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

మియాపూర్‌లో..
మియాపూర్ డివిజన్ పరిధిలోని జయప్రకాష్ నారాయణ నగర్ కాలనీలో స్థానికులతో కలిసి ఎన్‌టీఆర్ విగ్రహానికి కార్పొరేటర్, జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యుడు ఉప్పలపాటి శ్రీకాంత్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కృష్ణం రాజు, జనార్ధన్ రావు, బలరాం, ఎస్ ఆర్ వెంకటేశ్వరావు, సూర్యదేవర శ్రీనివాస్, చిలుకూరి శ్రీనివాస్, రమేష్ , నరేంద్ర , కిరణ్, జితేంద్ర, బాబు రెడ్డి, రవి రెడ్డి, జగదీష్ రెడ్డి, రామారావు, నందమూరి అభిమానులు , శ్రేయభిలాషులు, మిత్రులు, నాయకులు, కార్యకర్తలు , కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

జగదీశ్వర్ గౌడ్ నివాళులు..
మియపూర్ డివిజన్ పరిధిలోని మియపూర్ మెట్రో డిపో రోడ్డులోని త్రివేణి సర్కిల్ హుడా మయూరి నగర్ ఎన్టీఆర్ విగ్రహానికి శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్, కూకట్ పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్, టిడిపి పొలిటీబ్యూరో సభ్యుడు, ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్ టిడి జనార్దన్, నర్సింహ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కూన సత్యం గౌడ్, బాలింగ్ యాదగిరి గౌడ్, ఉరిటి వెంకట్ రావు, మన్నెపల్లి సాంబశివరావు, కావూరి ప్రసాద్, నాగేశ్వరరావు, కనకమామిడి నరేందర్ గౌడ్, కొడాలి శ్రీధర్, రాజేష్, నల్లమల రమేష్, వేమూరి సాంబశివరావు, యలమంచి ఉదయ్, రవి కుమార్ గౌడ్, తలూరి రమేష్, ఎస్ఆర్‌కె చౌదరి, కావూరి వినయ్, శశికాంత్, శివ, స్వరూప్, కావూరి మధు, సురేష్, ఆనంద రావు, రాము, వాసు, నర్సింహ రావు, వంశీ, ప్రభాకర్ రావు, భరత్, శివనంద్ రెడ్డి, సురేష్, వెంకటేష్, లక్ష్మీ నారాయణ రావు తదితరులు పాల్గొన్నారు.
