శేరిలింగంపల్లి, జనవరి 18 (నమస్తే శేరిలింగంపల్లి): అనారోగ్యం తో బాధపడుతున్న మహిళకు లయన్స్ క్లబ్ ఆఫ్ హోప్ చేయూతనందించింది. చందానగర్ హుడా కాలనీ లో నిర్వహించిన కార్యక్రమంలో ఆర్థిక సహాయం అందజేశారు. అల్మాస్ గూడ కు చెందిన ఉమాదేవి అనారోగ్యం తో బాధపడుతుంది. విషయం తెలుసుకున్న క్లబ్ ఫౌండర్ అధ్యక్షుడు కొండా విజయ్, కో ఆర్డినేటర్ రమణ చేతుల మీదుగా బాధితురాలికి రూ 10 వేల రూపాయలను అందచేశారు. తమ క్లబ్ ద్వారా రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలను చేపట్టనున్నట్లు కొండా విజయ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ హోప్ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, ట్రెజరర్ రెడ్డి ప్రవీణ్ రెడ్డి, ఉపాధ్యక్షుడు బర్కా మల్లేష్ యాదవ్, సింగిదారి రాజశేఖర్, మారం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
