ఘనంగా బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 5 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): దళితుల హక్కుల కోసం పోరాడిన యోధుడు, గొప్ప సంఘ సంస్కర్త , రాజకీయ వేత్త, స్పూర్తి ప్రధాత బాబు జగజ్జీవన్ రామ్ అని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటేస్టెడ్ ఎమ్మెల్యే, ఇంఛార్జి రవికుమార్ యాదవ్ అన్నారు. బాబు జగజ్జీవన్ రామ్ 117 వ జయంతి సందర్భంగా మసీద్ బండ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జయంతి వేడుకలలో నియోజకవర్గ బీజేపీ నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ర‌వికుమార్ యాద‌వ్‌ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ బీహార్ లోని చిన్న గ్రామంలో జన్మించి, విద్యార్థి దశ నుండే సామాజిక సమస్యలపై అవగాహన చేసుకుంటూ, కుల వివక్షను ఎదురకొంటూ విద్యను పూర్తి చేసిన గొప్ప రాజనీతజ్ఞుడని అన్నారు, ఆయన స్వాతంత్ర్య సమరయోధుడు, దళితుల హక్కుల కోసం పోరాటం చేసిన యోధుడు, గొప్ప సంఘ సంస్కర్త, రాజకీయవేత్త అని కొనియాడారు.

భారతదేశ రాజకీయాలలో అత్యంత ప్రభావవంతమైన నాయకులలో ఒకరిగా గుర్తింపు పొందిన నాయకుడని, భారతదేశ ఉప ప్రధానిగా, జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ ప్రభుత్వాలలో వ్యవసాయ ,రక్షణ మంత్రిగా పనిచేసి దేశ క్షేమం కోసం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు రామరాజు, కేశవులు ,నాగుల్ గౌడ్ , మణి భూషణ్, నర్సింగ్ యాదవ్, రాధాకృష్ణ యాదవ్ ,వెంకటస్వామి రెడ్డి ,నరసింహ చారి, కుమార్ యాదవ్, మనోహర్ గౌడ్, మహేష్ యాదవ్ ,ఆంజనేయులు సాగర్, నర్సింగ్ రావు , ఎత్తరి రమేష్ ,మాణిక్ రావు, శ్రీనివాస్ యాదవ్ ,కిషోర్ ముదిరాజ్, లక్ష్మణ్ ముదిరాజ్, అరవింద్, గణేష్ ముదిరాజ్, విజేందర్, పృద్వి గౌడ్, రాయల్ ఆంజనేయులు యాదవ్ ,పట్టాభిరామ్ , ప్రభాకర్ , శివారెడ్డి ,sk చాంద్, సురేష్, మల్లారెడ్డి, రాజు ,సురేష్, చందు, రాము, మహిళా నాయకులు రెడ్డమ్మ,కోమలి, మీనా, జ్యోతి, స్వప్న ,కల్పనా, రాణి , కళ్యాణ్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here