శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 21 (నమస్తే శేరిలింగంపల్లి): ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నో నగరంలో అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి, గ్రేటర్ హైదరాబాద్ నుండి 50 మంది కార్పొరేటర్లు, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో కలిసి గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి స్టడీ టూర్ లో భాగంగా లక్నో నగరానికి వెళ్లారు. అక్కడ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న మౌలిక వసతులు, జరుగుతున్న అభివృద్ధి పనులను అక్కడి అధికారులతో కలిసి పరిశీలించారు.
భౌగోళిక పరిస్థితులు, అక్కడి ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక వసతుల గురించి తెలుసుకొని, హైదరాబాద్ నగరంలో అమలు చేయాల్సిన నియమ నిబంధనలు, అభివృద్ధి విధానాలపై అధ్యయనం చేశారు. ఈ సందర్శన ప్రధాన ఉద్దేశ్యం రెండు నగరాల మధ్య సాన్నిహిత్యాన్ని పెంపొందించడం, అలాగే పౌర, అభివృద్ధి కార్యక్రమాల్లో సహకార అవకాశాలను అన్వేషించడం అని కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి తెలిపారు.