హఫీజ్ పేట్ డివిజన్ గంగారంలో బీజేపీ గావ్ ఛలో బస్తీ ఛలో కార్యక్రమం

శేరిలింగంపల్లి, ఏప్రిల్ 17 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా క‌మిటీ పిలుపుమేరకు భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా హఫీజ్ పేట్ డివిజన్ గంగారం గ్రామంలో హఫీజ్ పెట్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు కైతాపురం జితేందర్ ఆధ్వర్యంలో బీజేపీ గావ్ ఛలో బస్తీ ఛలో కార్యక్రమంలో డివిజన్ కార్యక్రమ ఇంచార్జ్ లు, బీజేపీ రాష్ట్ర నాయకుడు బాల్ద అశోక్ , శేరిలింగంపల్లి డివిజన్ బీజేపీ కంటెస్టెడ్ కార్పొరేటర్ కర్చర్ల ఎల్లేష్ పాల్గొని గంగారం గ్రామంలోని ప‌లు స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించారు. బస్తీ దవాఖానలో స్వచ్ఛ భారత్ నిర్వహించి వసతుల గురించి డాక్టర్ తో మాట్లాడి సమస్యల వివరాలు సేకరించారు.

(అంగన్వాడి కేంద్రంను సందర్శించి, వసతుల గురించి తెలుసుకొని, సమస్యల వివరాలు సేకరించారు. ప్రభుత్వ పాఠశాలను సందర్శించి వసతుల గురించి తెలుసుకొని, సమస్యల వివరాలు సేకరించారు. గంగారం గ్రామ నాయ‌కుడు దేవానంద్ యాదవ్ నివాసానికి వెళ్లి ఆయ‌న‌తో గ్రామంలోని వివిధ విషయాలపై చర్చించారు. బస్తీలో పర్యటించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 10 సంవత్సరాల పాలన గురించి వివరిస్తూ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి తెలియజేశారు. ఈ సంద‌ర్భంగా క‌రపత్రాలు పంపిణీ చేశారు. బస్తీ చౌరస్తాలో బీజేపీ జెండా ఆవిష్కరణ చేసి, బీజేపీ 46వ ఆవిర్భావ దినోత్సవ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. బీజేపీ సీనియర్ కార్యకర్త మల్లేశంని శాలువాతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో గంగారం గ్రామ సీనియర్ నాయకుడు దేవానంద్ యాదవ్, రంగారెడ్డి అర్బన్ జిల్లా బిజెపి అధికార ప్రతినిధి అజిత్ సేనాపతి, మాజీ కౌన్సిలర్ రమణయ్య , హఫీజ్ పేట్ డివిజన్ బీజేపీ మాజీ అధ్యక్షుడు శ్రీధర్ రావు , బిజెపి జిల్లా గీత సెల్ కన్వీనర్ రవి గౌడ్ , బీజేపీ నాయకులు అశోక్ , నర్సింహులు , వీర్రాజు , శ్రీనివాస్ , శేఖర్ , నందు , మల్లేశం , రాంరెడ్డి , విశాల్ , కిరణ్ , వెంకట్ , సుబ్బు , లోకేష్ , యాది పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here