వరద ముంపు సమస్య నుండి శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు

శేరిలింగంపల్లి, ఫిబ్ర‌వ‌రి 1 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): డివిజన్ అభివృద్ధిలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు పోతున్నామని స్థానిక ఎమ్మెల్యే పిఎసి చైర్మన్ ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, గంగాధర్ రెడ్డిలు అన్నారు. నల్లగండ్ల చెరువు నుండి BHEL చౌరస్తా ఇండియన్ గ్యాస్ గోడౌన్ నాలా వరకు SNDP అండర్ H-CITI లో భాగంగా రూ. 28 కోట్ల‌ 45 లక్షల వ్యయంతో నూతనంగా చేపట్టబోయే ఓపెన్ డ్రైన్ RCC బెడ్, సైడ్ వాల్స్ నిర్మాణం పనులకు పిఏసీ ఛైర్మెన్, శేరిలింగంపల్లి శాసనసభ్యుడు ఆరెక‌పూడి గాంధీ, సంబంధిత జిహెచ్ఎంసీ అధికారులతో కలిసి శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ శిలాఫలాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.

ఈ సందర్బంగా నాగేంద‌ర్ యాద‌వ్‌ మాట్లాడుతూ.. నాలాల విస్తరణ పనులతో లోతట్టు, ముంపు ప్రాంతాలకు శాశ్వత ఉపశమనం అని పేర్కొన్నారు. RCC బాక్స్ డ్రైన్ పనులను త్వరితగతిన పూర్తి చేసి రాబోయే వర్షాకాలం లోపు పరిసర ప్రాంతవాసులకు అందుబాటులోకి తీసుకువచ్చేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు గంగాధర్ రెడ్డి, ఉప్పలపాటి శ్రీకాంత్, జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులు డిఈ ఆనంద్, ఈఈ దుర్గా ప్రసాద్, SNDP డిఈ రాజు, SNDP ఈఈ సత్యనారాయణ, డివిజన్ అధ్యక్షుడు రాజు యాదవ్, డివిజన్ గౌరవ అధ్యక్షుడు దుర్గం వీరేశం గౌడ్, చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ రాజేశ్వరమ్మ, కాశిమ్, జయంత్ కుమార్, ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, వార్డ్ మెంబర్ కవిత గోపాల కృష్ణ, వార్డ్ మెంబర్ శ్రీకళ వెంకటేశ్వర్లు, వార్డ్ మెంబర్ పర్వీన్ బేగం, సీనియర్ నాయకులు రాంచందర్, జనార్దన్ రెడ్డి, పద్మారావు, గోవింద్ చారీ, నర్సింహా రెడ్డి, గోపాల్ యాదవ్, నారాయణ, రాజ్ కుమార్, పవన్, సుధాకర్ చారీ, బస్వయ్య, మల్లేష్ యాదవ్, రమణ, నటరాజ్, అహ్మద్, రహీం, సయ్యద్ నయీమ్, వెంకటేష్, నరేందర్, కుటుంబరావు, రవి, వినయ్, యాదగిరి, ఫకృద్దీన్, కిరణ్, ముంతాజ్ బేగం తదితర స్థానిక కాలనీ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here