శేరిలింగంపల్లి, మార్చి 6 (నమస్తే శేరిలింగంపల్లి): వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ కాలనీ లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణం లోని శ్రీ కార్యసిద్ధి అభయాంజనేయ స్వామి వారి 5వ వార్షికోత్సవం కార్యక్రమంలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాయి నేనీ చంద్రకాంత్, ప్రసాద్, నాని, నాగేశ్వరరావు, కృష్ణం రాజు, కుమార్, భక్తులు తదితరులు పాల్గొన్నారు.