బాలికల వికాసానికి సేవాభారతి తోడ్పాటు – బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్

నమస్తే శేరిలింగంపల్లి: బాలికల వికాసానికి తోడ్పాటునందిస్తూ సేవా భారతి ప్రపంచానికి మంచి సందేశాన్ని అందిస్తోందని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ అన్నారు. హఫీజ్‌పేట్ ఫ్లైఓవర్ సమీపంలోని ఆదిత్య ఇంపీరియల్ హైట్స్ వద్ద సేవా భారతి ఆధ్వర్యంలో బాలికల సాధికారత కోసం వార్షిక రన్ ఫర్ ఎ గర్ల్ చైల్డ్ ఫండ్ రైజింగ్ ఈవెంట్ 6వ ఎడిషన్ కోసం మియాపూర్ సౌత్ రన్ ను ప్రారంభించారు. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్రప్రసాద్, నాయకులు రవి కుమార్ యాదవ్, మువ్వా సత్యనారాయణ తదితరులు రన్ కు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బేటీ బచావో బేటీ పడావో నినాదంతో ప్రధాని నరేంద్ర మోదీ బాలికల విద్యను ప్రోత్సహిస్తున్నారని, స్త్రీ, పురుషుల మధ్యనున్న వ్యత్యాసాలను తగ్గించేందుకు సమాజంలో మరింత చైతన్యం తీసుకరావాల్సిన అవసరం ఉందన్నారు. సేవా భారతి స్వచ్ఛంద సంస్థ తెలంగాణలో 185 కిశోర్‌ వికాస్‌ కేంద్రాల ద్వారా బాలికలకు విద్య, వృత్తి విద్యలో శిక్షణ ఇస్తోందన్నారు. 10వేల ఆడపిల్లల శక్తి సామర్ధ్యాలను, వారి నైపుణ్యాలను ప్రపంచానికి చాటే మోటివ్ తో కొనసాగిన ఈ 5k రన్ లో పాల్గొనడం సంతోషకరమని అన్నారు. కార్యక్రమంలో సంఘ్ పరివార్ సంస్థల పెద్దలు శాస్త్రీ రావు, లక్ష్మణ్ రావు జీ. భూషణ్, కృష్ణ రెడ్డి, లక్ష్మణ్, సంజయ్, నాయకులు పృథ్వి కాంత్, శ్రీధర్ రావు, జితేందర్, రవి గౌడ్, కోటేశ్వర రావు, తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here