నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ లోని శిల్పారామంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిక్ట్ హ్యాండ్లూమ్ ఎక్స్ పో లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. సాత్విక స్కూల్ అఫ్ భరతనాట్యం గురువు డాక్టర్ ఎస్.ఎన్ సత్య శిష్య బృందం కళాకారులు ప్రదర్శించిన భరతనాట్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. వాజ్హువూర్ ప్రేయర్ సాంగ్ , పుష్పాంజలి, శ్లోకం, కీర్తనం, గణేష్ కౌత్వం, జతిస్వరం, ముద్దుగారే యశోద, స్వరజతి, శ్యామలే మీనాక్షి, మంగళం – సీత కల్యాణ తదితర అంశాలపై నృత్య ప్రదర్శనలు చేశారు. కళాకారులు శ్రేయ, సాధ్వి, అర్చితా, తాన్యా, వర్ష, కృప, స్ఫూర్తి, రియన్షిక, అక్షత, రిత్విక తదితరుల ప్రదర్శనలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రముఖ భరతనాట్య కళాకారిణి డాక్టర్ జ్యోతిర్మయి ముఖ్య అతిథిగా విచ్చేసి కళాకారులను సత్కరించారు.