ఆపన్నహస్తంలా ముఖ్యమంత్రి సహాయ నిధి – ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం లాంటిదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలువురు అత్యవసర చికిత్స కోసం దరఖాస్తు చేసుకున్న వారికి రూ. 5.70 లక్షల సీఎంఆర్ఎఫ్ ఎల్ ఓ సీ పత్రాలను కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తో కలిసి ప్రభుత్వ విప్ గాంధీ అందజేశారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని రాజారామ్ కాలనీ కి చెందిన లక్ష్మీకి అత్యవసర చికిత్స కోసం ముఖ్య మంత్రి సహాయ నిధి ద్వారా రూ.3 లక్షల ఎల్ ఓ సీ, ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని మహంకాళి నగర్ కి చెందిన కనక సింహాచలం అనే వ్యక్తి కి రూ. 2 లక్షల, కొండాపూర్ డివిజన్ పరిధిలోని సిద్దిక్ నగర్ కాలనీ కి చెందిన తిరుపతయ్య రూ.70 వేల సీఎంఆర్ఎఫ్ ఎల్ ఓ సీ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నిరంతరం సేవలందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కాశినాథ్ యాదవ్, సురేందర్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

సీఎంఆర్ఎఫ్ ఎల్ ఓ సీ పత్రాలను అందజేస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here