నమస్తే శేరిలింగంపల్లి:ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటున్న వారి ఇళ్లను క్రమబద్దీకరించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 58,59 జీఓ గడువు తేదీని పొడగించాలని టీఆర్ఎస్ నియోజకవర్గం నాయకులు మిద్దెల మల్లారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శేరిలింగంపల్లి తహశీల్దార్ కార్యాలయంలో ఉప తహశీల్దార్ మణిపాల్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. పేదల ఇళ్ల క్రమబద్ధీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఓ నంబర్ 58,59 గడువు తేదీ ఈ నెల 31వ తేదీన ముగియడంతో ఇంకా చాలా మంది పేదలకు అవగాహన లేక దరఖాస్తు చేసుకోలేదన్నారు. ప్రజల సౌకర్యార్థం గడువు తేదీని పొడగించాలని మల్లారెడ్డి విజ్ఞప్తి చేశారు. పేద ప్రజలకు అనుకూలంగా ఉండేలా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన జీవో 58,59నుసద్వినియోగం చేసుకోవాలన్నారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో మల్లారెడ్డి, గంగారం సంగారెడ్డి ఉన్నారు.