కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల ధోర‌ణి స‌రికాదు – ఎంసీపీఐయూ రాష్ట్ర కార్య‌ద‌ర్శి గాద‌గోని ర‌వి

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లిః కేంద్ర ప్ర‌భుత్వ వ్య‌తిరేక విధానాలతో ప్ర‌జ‌ల‌కు జీవ‌నోపాధి లేకుండా చేస్తున్నార‌ని, కేంద్ర‌, రాష్ర్ట ప్ర‌భుత్వాలు పెంచుతున్న ధ‌ర‌ల‌తో సామాన్య ప్ర‌జ‌లు బ‌తుకుదెరువు క‌ష్టంగా మారింద‌ని ఎంసీపీఐయూ రాష్ట్ర కార్య‌ద‌ర్శి గాద‌గోని ర‌వి వాపోయారు. కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో టీఆర్ఎస్ అవ‌లంభిస్తున్న ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను వ్య‌తిరేకిస్తూ చేప‌ట్టిన సార్వ‌త్రిక స‌మ్మె రెండో రెండవ రోజులో భాగంగా ఎంసీపీఐయూ, ఏఐసీటీయూ, ఏఐకేఎఫ్‌, ఏఐఎఫ్‌డీడబ్ల్యు, ఏఐఎఫ్‌డీవై, ఏఐఎఫ్‌డీఎస్‌, యూపీఎన్ఎం రాష్ట్ర క‌మిటీల ఆధ్వ‌ర్యంలో ఓంకార్ భ‌వ‌న్ బాగ్ లింగంప‌ల్లి నుంచి న‌ల్ల‌కుంట మార్కెట్ రోడ్డు అంబేద్క‌ర్ కాలేజీ సుంద‌ర‌య్య పార్కు నుంచి సుంద‌ర‌య్య భ‌వ‌న్ వ‌ర‌కు పెద్ద ఎత్తున ర్యాలీ ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హించారు. కార్మిక వ్య‌తిరేక‌, రైతు వ్య‌తిరేక‌, ప్ర‌జా వ్య‌తిరేక‌, దేశ వ్య‌తిరేక విధానాల‌కు కేంద్రంలో బిజెపి పాల్ప‌డుతుంద‌న్నారు. కార్పొరేట్ల‌కు సేవ చేయ‌డం, కార్మికుల హ‌క్కుల‌ను హ‌రించ‌డ‌మే ల‌క్ష్యంగా చేసుకుని ప్ర‌ధాని మోదీ కేంద్రంలో పాల‌న కొన‌సాగిస్తున్నార‌ని ఎద్దేవా చేశారు. ఈ స‌మ్మెలో ఏఐకేఎఫ్‌ రాష్ట్ర రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లే పు ఉపేందర్ రెడ్డి, ఏఐసీటీయూ రాష్ట్ర అధ్యక్షులు టి అనిల్ కుమార్, ఏఐఎఫ్‌డీవై రాష్ట్ర కార్యదర్శి వనం సుధాకర్, ఏఐఎఫ్‌డీడబ్ల్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంభం సుకన్య, ఏఐఎఫ్‌డీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పల్లె మురళి, యూపీఎన్ఎం రాష్ట్ర నాయకులు ధారా లక్ష్మి, ఏఐసీటీయూ నాయకులు బి. పురుషోత్తం, ఎర్ర రాజేష్, ఎంసీపీఐయూ గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి వి. తుకారం నాయక్, రాష్ట్ర నాయకులు ఈ.కిష్టయ్య, గ్రేటర్ హైదరాబాద్ కమిటీ సభ్యులు కన్న శ్రీనివాస్, ఏఐఎఫ్‌డీడ‌బ్ల్యు గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి ఏ.పుష్ప తో పాటు ఎం రాణి, బి సుజాత, శ్రీలత, నాయకులు ఆర్ ఝాన్సీ, రామ్ చందర్, కే. రాజు, రవీందర్ గౌడ్, గ్రేటర్ హైదరాబాద్ కమిటీ సభ్యులు బి.రవి, ఎల్.రాజు, పి రాజు, పవన్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here