వేస‌వి కాలం దృష్ట్యా నీటి స‌మ‌స్య లేకుండా చూస్తాం – మాదాపూర్ కార్పొరేట‌ర్ జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్‌

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లిః వేస‌వి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని మాదాపూర్ డివిజ‌న్ ప‌రిధిలోని ఆయా కాల‌నీల్లో మంచినీటి స‌మ‌స్య, డ్రైనేజీ స‌మ‌స్య లేకుండా ఎప్ప‌టిక‌ప్పుడు త‌గిన ఏర్పాట్లు చేయ‌నున్న‌ట్లు మాదాపూర్ డివిజ‌న్ కార్పొరేట‌ర్ వి. జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్ తెలిపారు. వేస‌వికాలం దృష్ట్యా మాదాపూర్ డివిజ‌న్ ప‌రిధిలోని ఆదిత్య న‌గ‌ర్ బ‌స్తీలో హెచ్.ఎం.డబ్లు.ఎస్.ఎస్.బి డీజీఎం శ్రీ‌మ‌న్నారాయ‌ణ‌, మేనేజ‌ర్ ఇల్వ‌ర్తి, స్థానికుల‌తో క‌లిసి కార్పొరేట‌ర్ జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్ స‌మీక్ష‌స‌మావేశం ఏర్పాటు చేశారు. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని రంజాన్ మాసం ప్రారంభమ‌వుతున్న తరుణంలో మసీదులో నీళ్ల సమస్య రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బస్తీలో కొంత భాగం డ్రైనేజీ ఔట్ లెట్ సమస్య పరిష్కరించాలని, అదేవిధంగా రోడ్లపై కార్లు నిలుపుతూ రాకపోకలకు ఇబ్బందులు గురిచేస్తున్నారని రాత్రి వేళల్లో పోలీస్ గస్తి పెంచాలని బస్తి ప్రజలు, నాయకులు కార్పొరేటర్ దృష్టికి తీసుకువ‌చ్చారు. బస్తీల్లో నూతనంగా వేసిన డ్రైనేజీ పై రోడ్డు నిర్మాణం చేప‌ట్టాల‌ని, పారిశుధ్య సమస్య లేకుండా ఎప్ప‌టిక‌ప్పుడు మ‌ట్టి కుప్ప‌ల‌ను, చెత్తా చెదారం తొల‌గించాల‌ని సంబంధిత అధికారుల‌కు కార్పొరేట‌ర్ ఆదేశించారు. ఈ స‌మావేశంలో ఆదిత్య నగర్ బస్తీ అధ్యక్షులు మునఫ్ ఖాన్, మాజీ అధ్యక్షులు ఖాసీం, మైనారిటీ అధ్యక్షులు రహీం, నాయకులు బాబూమియా, లియకత్, సలీం, యూత్ అధ్యక్షుడు ఖాజా, డాక్టర్అ ఖిల్, యూత్ సభ్యులు మహమ్మద్, మూకీన్, సల్మాన్ తదితరులు పాల్గొన్నారు.

ఆదిత్య న‌గ‌ర్‌లో కాల‌నీ వాసుల‌తో స‌మావేశ‌మైన మాదాపూర్ కార్పొరేట‌ర్ జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్‌
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here