సిద్దిఖ్ న‌గ‌ర్‌లో ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకుంటున్న కొండాపూర్ కార్పొరేట‌ర్ హ‌మీద్ ప‌టేల్‌

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లిః ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డ‌మే ల‌క్ష్యంగా ప‌నిచేస్తున్నామ‌ని కొండాపూర్ కార్పొరేట‌ర్ హ‌మీద్ ప‌టేల్ అన్నారు. కొండాపూర్ డివిజ‌న్ ప‌రిధిలోని సిద్ధిఖ్ న‌గ‌ర్ లో బ‌స్తీ వాసులు, వాట‌ర్ బోర్డు అధికారుల‌తో క‌లిసి స్థానిక కార్పొరేట‌ర్ హ‌మీద్ పటేల్ పాద‌యాత్ర చేశారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. కాల‌నీలో నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌ను ద‌శ‌ల వారీగా ప‌రిష్క‌రించ‌నున్న‌ట్లు కార్పొరేట‌ర్ చెప్పారు. ప్రజ‌ల‌కు కావాల్సిన మౌలిక స‌దుపాయ‌ల‌ను క‌ల్పిస్తామ‌న్నారు. కాల‌నీలో మంజూరైన అండ‌ర్ గ్రౌండ్ డ్రైనేజీ ప‌నులు, మంజీరా మంచి నీటి పైపులైన్ ప‌నుల‌ను త్వ‌రిత‌గ‌తిన చేపట్టి ప‌నులు పూర్తి చేయాల‌ని వాట‌ర్ వ‌ర్క్స్ మేనేజ‌ర్ నివ‌ర్తికి సూచించారు. ఈ కార్య‌క్ర‌మంలో సిద్దిఖ్ నగర్ ప్రెసిడెంట్ బసవరాజు,  సీనియర్ నాయకులు నందు, సాగర్ చౌదరి, తిరుపతి రెడ్డి, చారీ, రాము యాదవ్, గణపతి, ఆనంద్ చౌదరి, వినోద్ యాదవ్, లక్ష్మి భాయ్, సరోజ రెడ్డి, మణెమ్మ, భాస్కర్, సంతోష్, రేఖా, కుమార్, గాలి రెడ్డి, మహేష్ రెడ్డి, బల్లు, రాము తదితరులు పాల్గొన్నారు.

సిద్దిఖ్ న‌గ‌ర్‌లో ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకుంటున్న కొండాపూర్ కార్పొరేట‌ర్ హ‌మీద్ ప‌టేల్‌
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here