లింకు రోడ్డు ఏర్పాటుతో ప్ర‌యాణం సుల‌భ‌త‌రం – వైశాలి న‌గ‌ర్‌లో ప‌ర్య‌టించిన ప్ర‌భుత్వ విప్ గాంధీ

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లిః హ‌ఫీజ్‌పేట్ డివిజ‌న్ ప‌రిధిలోని వైశాలి న‌గ‌ర్‌లో ప్ర‌భుత్వ విప్‌, ఎమ్మెల్యే అరెక‌పూడి గాంధీ జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారుల‌తో క‌లిసి ప‌ర్య‌టించారు. వైశాలి న‌గ‌ర్ నుంచి మ‌సీదు బండ రైల్వే ట్రాక్ రోడ్డుకు వెళ్లేందుకు వీలుగా నిర్మించ‌నున్న లింకురోడ్డును ఏసీపీ సంప‌త్ తో క‌లిసి ప‌రిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ వైశాలి నగర్ కాలనీ వాసుల‌తో పాటు చుట్టుప‌క్క‌ల‌ ప్రజల సౌకర్యార్థం ఈ లింక్ రోడ్డు నిర్మాణం చేప‌ట్ట‌నున్న‌ట్లు చెప్పారు. ప్రజల రవాణా సౌకర్యార్థం ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయ రోడ్డును నిర్మించేలా తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్ గాంధీ అధికారుల‌కు ఆదేశించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని, అన్నివేళలా ప్రజలకు అందుబాటులోకి ఉంటూ మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ ఏసీపీ సంపత్, కాలనీ వాసులు శాస్త్రి, గణేష్, అంజి రెడ్డి, వినోద్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

వైశాలి న‌గ‌ర్ లో జీహెచ్ఎంసీ అధికారుల‌తో క‌లిసి ప‌ర్య‌టిస్తున్న ఎమ్మెల్యే అరెక‌పూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here