ప్రతి డివిజన్ లో మన్ కీ బాత్ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం – బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: దేశ ప్రజలందరికి మరింత చేరువై సందేశమిచ్చేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని చేపట్టారని బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని లింగంపల్లి రైల్వే స్టేషన్ వద్ద మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రధానమంత్రి మోదీ సందేశాన్ని నేరుగా వీక్షించేలా బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ ఎల్ ఈ డి స్క్రీన్ ను ఏర్పాటు చేయించారు. ప్రజలతో కలిసి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రజలకి చేరువయ్యేలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు,దేశంలో జరిగే మంచి పనులను తెలియజేయాలనే సదుద్దేశంతో మన్ కీ బాత్ ను ప్రారంభించారని అన్నారు. మన్ కీ బాత్ ద్వారా భారతదేశంలో పౌరుల ద్వారా వచ్చిన ఎన్నో గొప్పగొప్ప ఆలోచనలు ప్రపంచం అంతా తెలుసుకునేలా చేస్తున్నారని చెప్పారు. మన్ కీ బాత్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. రాబోయే రోజుల్లో శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని ప్రతి డివిజన్ లో మన్ కీ బాత్ కార్యక్రమం చేపట్టాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, నాయకులు నాగేశ్వర్ గౌడ్, ఎల్లేశ్, రాఘవేంద్రరావు, రాఘవేంద్ర రాజు, రమేష్, హనుమంత నాయక్, చంద్రమౌళి, సీతారామరాజు, లక్ష్మణ్ ముదిరాజ్, హరికృష్ణ, తిరుపతి, గణేష్ ముదిరాజ్, మహిళా నాయకులు పద్మ, అరుణ, రేణుక, విజయలక్ష్మి, సుశీల, నరసింహ, జె శ్రీను, రాము తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here