శిల్ప పార్కులోని పార్కును రూ. 5 ల‌క్ష‌ల‌తో అభివృద్ధి చేస్తాం – ప్ర‌భుత్వ‌విప్ అరెక‌పూడి గాంధీ

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లిః మాదాపూర్ డివిజన్ పరిధిలోని శిల్ప పార్క్ లో రూ. 5 ల‌క్ష‌ల వ్య‌యంతో సీడీపీ నిధుల ద్వారా పార్క్ అభివృద్ధి ప‌నుల‌ను చేప‌ట్టి అహ్లాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం క‌ల్పించేలా కృషి చేస్తామ‌ని ప్ర‌భుత్వ విప్‌, ఎమ్మెల్యే అరెక‌పూడి గాంధీ అన్నారు. ఈ మేర‌కు ఎమ్మెల్యే నిధులు రూ. 5 ల‌క్ష‌లు మంజూరు చేయాల‌ని కోరుతూ రంగారెడ్డి జిల్లా క‌లెక్ట‌ర్ కు పంపిన మంజూరు ప‌త్రాల‌ను శిల్ప పార్కు వాసుల‌ను ప్ర‌భుత్వ విప్ అరెక‌పూడి గాంధీ అంద‌జేశారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ మాదాపూర్ డివిజన్ సమగ్ర ,సంతులిత అభివృద్ధి లో భాగంగా శిల్ప పార్క్ కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు పార్క్ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే సీడీపీ నిధులు రూ. 5 ల‌క్ష‌లు మంజూరు చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్‌కు ప్ర‌తిపాద‌న‌లు పంపిన‌ట్లు చెప్పారు. నిధులు మంజూరు కాగానే పార్క్ ను త్వరితగతిన అభివృద్ధి పనులు చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకువ‌స్తామ‌న్నారు. పార్క్ లు కాలనీలలో చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంను పెంపొందిస్తాయని చెప్పారు. అడిగిన వెంట‌నే పార్కు అభివృద్ధికి స‌హ‌క‌రించిన ప్ర‌భుత్వ విప్ గాంధీకి కాల‌నీ వాసులు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ కార్యాక్రమంలో శిల్ప పార్క్ కాలనీ వాసులు శ్రీనివాస్ రెడ్డి, రమణ రావు, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here