చందాన‌గ‌ర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వ‌ర్యంలో చ‌లివేంద్రం ఏర్పాటు

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లిః వేస‌వి కాలంలో పాద‌చారులు, సామాన్య ప్ర‌జ‌ల ఇబ్బందుల‌ను దృష్టిలో ఉంచుకుని చ‌లివేంద్రాన్ని ప్రారంభించ‌డం జ‌రిగింద‌ని చందాన‌గ‌ర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ సొసైటీ స‌భ్యులు పేర్కొన్నారు. చందానగర్ లోని సరస్వతి విద్యా మందిర్ వద్ద చందానగర్ రెసిడెంట్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వ‌ర్యంలో వేసవి కాలం లో సాధారణ ప్రజలకు ఉపయోగపడేలా ఏర్పాటు చేసిన చ‌లివేంద్రాన్ని ప్రారంభించారు. ఎండ‌లు విప‌రీతంగా ఉండ‌డంతో కొంద‌రు ప్ర‌జ‌లు దాహార్తికి చాలా ఇబ్బందులు ప‌డుతున్నార‌న్న విష‌యాన్ని గ‌మ‌నించామ‌ని సొసైటీ స‌భ్యులు తెలిపారు. వారికి త‌మ‌వంతుగా దాహార్తిని తీర్చేందుకు ఈ చ‌లివేంద్రాన్ని ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌న్నారు. స‌మాజ సేవ‌లో ప్ర‌తి ఒక్క‌రూ పాల్గొనాల‌ని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్ధానిక పెద్దలు, సొసైటీ సభ్యులు విజయ్ కుమార్, జర్రిపేటి జైపాల్, సాంబయ్య‌, సతీష్, అశోక్ గౌడ్, రఘుపతి రెడ్డి, మూగ‌ల‌ రఘునందన్ రెడ్డి, రామచంద్రారెడ్డి, నాగభూషణరావు పాల్గొన్నారు.

చందాన‌గ‌ర్ స‌ర‌స్వ‌తీ విద్యా మందిర్ వ‌ద్ద చ‌లివేంద్రాన్ని ఏర్పాటు చేసిన రెసిడెంట్స్ వెల్ఫేర్ సొసైటీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here