బిజెపి మైనార్టీ మోర్చా హ‌పీజ్ పేట్ డివిజ‌న్ అధ్య‌క్షునిగా మ‌హ్మ‌ద్ స‌లీం

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లిః ఆల్విన్ ఎక్స్ రోడ్డులోని బిజెపి కార్యాల‌యంలో మైనార్టీనాయ‌కుల‌తో బిజెపి రాష్ట్ర కార్య‌వ‌ర్గ‌స‌భ్యులు జ్ఞానేంద్ర ప్ర‌సాద్ స‌మావేశం నిర్వ‌హించారు. హ‌పీజ్ పేట్ డివిజ‌న్ మైనార్టీ మోర్చా అధ్య‌క్షునిగా మ‌హ్మ‌ద్ స‌లీం నియామ‌కం అయ్యారు. ఈ మేర‌కు జ్ఞానేంద్ర ప్ర‌సాద్ చేతుల మీదుగా మ‌హ్మ‌ద్‌స‌లీంకు నియామ‌క‌పు ప‌త్రాన్ని అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా జ్ఞానేంద్ర ప్ర‌సాద్ మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో పార్టీ బ‌లోపేతానికి కృషి చేయాల‌ని సూచించారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుని బిజెపి త‌ర‌పున పోరాటం చేసి వాటి ప‌రిష్కారానికి కృషి చేయాల‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో మైనార్టీ మోర్చా రాష్ట్ర కార్య‌వ‌ర్గ‌స‌భ్యులు షేక్ సైబుల్లా ఖాన్‌, ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు మ‌హేష్ యాద‌వ్‌, నాయ‌కులు బాబురెడ్డి, న‌వీన్‌, హ‌ర్ష‌ద్‌, ఉద‌య త‌దిత‌రులు పాల్గొన్నారు.


బిజెపి మైనార్టీ మోర్చా హ‌పీజ్ పేట్ డివిజ‌న్ అధ్య‌క్షునిగా మ‌హ్మ‌ద్ స‌లీంకు నియామ‌క‌పు ప‌త్రాన్ని అంద‌జేస్తున్న జ్ఞానేంద్ర ప్ర‌సాద్‌
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here