సీతారామాంజనేయ స్వామి ఆలయంలో అన్నదాన సత్రం ప్రారంభం – అన్న‌పూర్ణ మాత‌కు వెండి ఆభ‌ర‌ణాలు, ప‌ట్టు వ‌స్త్రాల‌ను స‌మ‌ర్పించిన ప్ర‌భుత్వ విప్ గాంధీ, కార్పొరేట‌ర్ రాగం నాగేంద‌ర్ యాద‌వ్

నమస్తే శేరిలింగంపల్లిః శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని హుడా ట్రేడ్ సెంటర్ లోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానం తృతీయ వార్షిక శ్రీరామ దశావతార యజ్ఞ మహోత్సవాలు మూడు రోజుల పాటు జరగనున్న దృష్ట్యా శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మశ్రీ కన్నేపల్లి శివరామ చంద్రమూర్తి పర్యవేక్షణలో ఆలయ ప్రాంగణంలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన శ్రీ శ్రీ శ్రీ అన్నపూర్ణ దేవి అన్నదాన సత్రాన్నిరాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు చైర్పర్సన్ రాగం సుజాత యాదవ్, స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ప్రారంభించారు. ఆలయ కమిటీ నిర్వాహకులు, వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి అన్నపూర్ణ దేవికి వెండి ఆభరణాలు, పట్టు వస్త్రాలను అతిథుల చేతుల మీదుగా అందజేశారు. అనంత‌రం భ‌క్తుల‌కు అన్న‌దాన కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. భ‌క్తుల కోసం ఆల‌య ప్రాంగ‌ణంలో అన్న‌దాన స‌త్రాన్ని ఏర్పాటు చేయ‌డం సంతోష‌క‌ర‌మ‌ని ఎమ్మెల్యే గాంధీ అన్నారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మశ్రీ కన్నేపల్లి శివరామ చంద్ర మూర్తి, ఆలయ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, కమిటీ సభ్యులు మహేష్, పవన్, బుచ్చి రెడ్డి, పెంటా రెడ్డి, భీంరావు, కృష్ణ, సురేష్, శ్రీనివాస్ రావు, కోటేశ్వరరావు, సత్యనారాయణ, యువజన నాయకులు అనిరుద్ యాదవ్, వార్డు మెంబర్ శ్రీకళ, కవిత, నాయకులు లక్ష్మణ్ యాదవ్, రవియాదవ్, గోపాల్ యాదవ్, గోపి, బస్వరాజ్, జమ్మయ్య, స్థానిక ముఖ్య నాయకులు, బస్తీ కమిటీ ప్రెసిడెంట్లు, కాలనీవాసులు, భక్తులు పాల్గొన్నారు.

అన్న‌పూర్ణ మాత‌కు వెండి ఆభ‌ర‌ణాలు, ప‌ట్టు వ‌స్త్రాల‌ను స‌మ‌ర్పించిన ప్ర‌భుత్వ విప్ గాంధీ, కార్పొరేట‌ర్ రాగం నాగేంద‌ర్ యాద‌వ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here