శిల్పారామంలో డిస్ట్రిక్ట్ హ్యాండ్లూమ్ ఎక్స్ పో ఎగ్జిబిష‌న్ ప్రారంభం

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లిః మాదాపూర్‌లోని శిల్పారామంలో మై హ్యాండ్లూమ్ – మై ప్రెండ్ అనే అంశంపై డెవ‌ల‌ప్ మెంట్ ఆప్ క‌మిష‌న‌ర్ హ్యాండ్లూమ్స్, మినిస్ట్రీ ఆప్ వి టెక్స్ టైల్స్ న్యూ ఢిల్లీ వీవ‌ర్స్ స‌ర్వీసింగ్ సెంట‌ర్ హైద‌రాబాద్ శిల్పారామం సంయుక్తంగా డిస్ట్రిక్ట్ హ్యాండ్లూమ్ ఎక్స్ పో ను శుక్ర‌వారం ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మానికి హ్యాండ్లూమ్స్ డెవ‌ల‌ప్ మెంట్ అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్ వివేక్ కుమార్ బాజ్ పాయి, రీజిన‌ల్ ఎన్ ఫోర్స్ మెంట్ ఆఫీస‌ర్ డాక్ట‌ర్ అరుణ్ కుమార్‌, శిల్పారామం జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ అంజ‌య్య పాల్గొని ఎగ్జిబిష‌న్‌ను ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ చేనేత హ‌స్త‌క‌ళ‌ల‌ను కాపాడుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌న్నారు. శిల్పారామంలో చేనేత‌, హ‌స్త క‌ళాకారులు ఉత్ప‌త్తి చేసిన వ‌స్తువుల‌నే విక్ర‌యించ‌డం జ‌రుగుతుంద‌న్నారు. ఈ ఎక్స్ ఫో కు దాదాపుగా 60 మంది చేనేత కళాకారులు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘ‌డ్ రాష్ట్రాల నుండి హాజ‌ర‌య్యారు. కోస, మహేశ్వరి, కోట, పోచంపల్లి, గద్వాల్, నారాయణపేట, భాగల్పూరి, ధర్మవరం, మంగళగిరి, త‌దిత‌ర‌ చేనేత పట్టు, కాటన్ చీరలు, డ్రెస్ మెటీరియల్స్ , బెడ్ షీట్స్ త‌దిత‌ర వ‌స్తువులు సందర్శకులకు అందుబాటులో ఉంచారు. అనంత‌రం సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శ్రీ సాయి ఆర్ట్స్ అకాడమీ శిష్యులు కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. మూషిక వాహన, తారంగం, భామాకలాపం, దేవా దేవమ్, గరుడ గమన, జై జనార్ధన, ముద్దుగారేయ్ యశోద, మహాగణపతిమ్ , ఏకదంతాయ, హనుమాన్ చాలీసా త‌దిత‌ర‌ అంశాలను ప్రదర్శించారు. ముసునూరి ఇందిరా శిష్యులు ప్రదర్శించిన కూచిపూడి నృత్య కుండలు, దీపాలపై ప్రదర్శించిన అంశం ఎంతగానో అలరించింది. ప్రముఖ నటి సుధాచంద్రన్ విచ్చేసి నృత్యకళాకారులకి జ్ఞాపికలు ఇచ్చి సత్కరించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here