పీజేఆర్ స్టేడియంలో ఆకట్టుకున్న పోలీసుల కవాతు – వ్యాయామంతో శారీరక దృఢత్వం, మానసిక సంతులనం: ఏసిపి కృష్ణ ప్రసాద్

నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ లోని పీజేఆర్ క్రీడా ప్రాంగణంలో శుక్రవారం పోలీసుల కవాతు ఆకట్టుకుంది. సైబరాబాద్ కమిషనరేట్ మాదాపూర్ జోన్ మియాపూర్ డివిజన్ లోని రామచంద్రాపురం, చందానగర్, మియాపూర్ పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది ఈ పరేడ్ లో పాల్గొన్నారు. మియాపూర్ ఏసిపి కృష్ణ ప్రసాద్ నేతృత్వంలో ఇన్స్పెక్టర్లు తిరుపతి రావు, క్యాస్ట్రో, సంజయ్ కుమార్ ల సారథ్యంలో ఎస్ఐలు, ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్ లతో సహా దాదాపు 160 మంది సిబ్బంది ఉత్సాహంగా పరేడ్ లో పాల్గొని శారీరక వ్యాయామం చేశారు. అనంతరం అందరూ కలిసి కవాతు నిర్వహించి ఏసీపీకి గౌరవ వందనం చేశారు. పోలీసుల కవాతు స్టేడియంలోని క్రీడాకారులకు, పాదచారులకు ఉత్సాహాన్ని కలిగించింది.

కవాతు నిర్వహిస్తున్న పోలీసులు

ఈ సందర్భంగా ఏసిపి కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ వీక్లీ పరేడ్ సాధారణంగా నిర్వహించే ప్రక్రియే అని, అయితే కరోనా వల్ల కొంత క్రమం తప్పిందని అన్నారు. ఇకపై ప్రతి వారం పోలీసుల కవాతు కొనసాగుతుందని అన్నారు. ఈ ప్రక్రియ వల్ల పోలీసుల్లో శారీరక దృఢత్వంతో పాటు, మానసిక సంతులనం కలుగుతుందని అన్నారు. విధి నిర్వహణలో భాగంగా రోజువారి వ్యాయామానికి దూరమయ్యే సిబ్బందికి వీక్లీ పరేడ్ ఎంతగానో ఉపశమనం కలిగిస్తుందని అన్నారు.

ఏసిపి కృష్ణ ప్రసాద్ కు గౌరవ వందనం చేస్తున్న పోలీసులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here