నమస్తే శేరిలింగంపల్లిః జాతీయ రహదారి దాటేందుకు వీలుగా పాదచారుల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం వంతెనలను ఏర్పాటు చేయడం జరుగుతుందని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ అన్నారు. హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని మదీనగూడ లోని యశోద పెరల్ వద్ద 65 వ నంబర్ గల జాతీయ రహదారిపై రూ. 5.50 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేసిన పాదచారుల వంతెనను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, జోనల్ కమిషనర్ ప్రియాంక అలా, డీపీ సుదాంష్, కార్పొరేటర్లు మంజుల రఘునాథ్ రెడ్డి, ఉప్పలపాటి శ్రీకాంత్, సింధు ఆదర్శ్ రెడ్డి తో కలిసి నగర మేయర్ గద్వాల విజయలక్ష్మీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చందానగర్, హఫీజ్ పేట్ డివిజన్ల పరిధిలోని ప్రజలకు జాతీయ రహదారి దాటడానికి వీలుగా ఈ పాదచారుల వంతెనలు ఒక వారధిగా పనిచేస్తాయన్నారు. పాదచారుల కోసం నూతనంగా ఏర్పాటు చేసిన ఫూట్ ఓవర్ బ్రిడ్జి లను ప్రారంభించుకోవడం సంతోషకరమన్నారు. మదీనగూడ, దీప్తి శ్రీ నగర్, పీజేఆర్ ఎన్ క్లేవ్, రామకృష్ణ నగర్, ఇంజనీర్స్ ఎన్ క్లేవ్, మై హోమ్ జ్యూవెల్, కేఎస్ ఎన్ క్లేవ్, గంగారాం, ఆర్టీసీ కాలనీ, హుడా కాలనీ, ఆదర్శ్ నగర్, శాంతి నగర్, అపర్ణ టవర్స్, పరిసర కాలనీలలో నివసిస్తున్న ప్రజలకు జాతీయ రహదారి ని దాటడానికి ఈ పాదచారుల వంతెనలు ఎంతగానో ఉపయోగపడతాయని ప్రభుత్వ విప్ గాంధీ అన్నారు. వృద్దులకు, పిల్లలకు, పాదచారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా లిఫ్ట్, ఎస్కలేటర్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణాలను ప్రకటనలకు మాత్రమే కాకుండా ప్రజలకు ఉపయోగపడేలా, ప్రమాద రహిత ప్రాంతాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం అన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు ఈఈ శ్రీకాంతిని, డీఈ స్రవంతి, డీఈ విశాలాక్షి, ఏఈ ప్రతాప్, ఏఎంఓహెచ్ కార్తిక్, మాజీ కౌన్సిలర్ లక్ష్మీనారాయణ గౌడ్, డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, గౌతమ్ గౌడ్, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళ నాయకులు, వార్డు మెంబర్లు, ఏరియా కమిటీ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.