సామాన్య ప్ర‌జ‌ల న‌డ్డి విరిచేలా కేంద్ర ప్ర‌భుత్వం ధ‌ర‌లు పెంచుతోంది – మియాపూర్ చౌర‌స్తాలో చేపట్టిన నిర‌స‌న‌లో మేయ‌ర్ విజ‌య‌ల‌క్ష్మీ, ప్ర‌భుత్వ‌విప్ గాంధీ, కార్పొరేట‌ర్లు

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లిః సామాన్య ప్ర‌జ‌ల న‌డ్డి విరిచేలా కేంద్ర ప్ర‌భుత్వం ఇష్టారీతిగా గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌ను పెంచ‌డం సిగ్గుచేట‌ని హైద‌రాబాద్ న‌గ‌ర మేయ‌ర్ గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మీ అన్నారు. కేంద్ర ప్ర‌భుత్వం పెంచుతున్న గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌ను నిర‌సిస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేర‌కు శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలోని మియాపూర్ – బొల్లారం చౌర‌స్తాలో టీఆర్ఎస్ ఆధ్వ‌ర్యంలో పెద్ద ఎత్తున నిర‌స‌న కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. ప్ర‌భుత్వ విప్‌, ఎమ్మెల్యే ఆరెక‌పూడి గాంధీ, కార్పొరేటర్లు ఉప్ప‌ల‌పాటి శ్రీకాంత్, రాగం నాగేందర్ యాదవ్, హమీద్ పటేల్, మంజుల రఘునాథ్ రెడ్డి, సింధు ఆదర్శ్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ సాయి బాబా, టీఆర్ఎస్ పార్టీ నాయ‌కుల‌తో క‌లిసి జీహెచ్ఎంసీ మేయ‌ర్ గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మీ పాల్గొని కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం చేశారు. ఈ సంద‌ర్భంగా మేయ‌ర్ విజ‌య‌ల‌క్ష్మీ మాట్లాడుతూ భారత దేశ జీడీపీ పెంచమంటే కేంద్ర ప్రభుత్వం గ్యాస్‌, డీజిల్‌, పెట్రోల్‌ ధరలు పెంచుతూ సామాన్యుడిపై భారం వేస్తుంద‌న్నారు. ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీ మాట్లాడుతూ సామాన్య ప్రజానీకానికి ఒక గుది బండ లాగా మారింద‌ని వాపోయారు. వంట నూనెలు, పప్పు దినుసుల నుండి పెంచిన పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా గ్యాస్ ధర పెంచడం వలన వంటింట్లో మహిళలకు మరింత పెను భార‌మైంద‌న్నారు. రాష్ట్ర ప్రజలను రోడ్లపైకి తెచ్చిన ఘనత మోదీ సర్కార్ కే దక్కుతుందన్నారు. 2014లో పెట్రోల్‌ ధర రూ.60 ఉండేదని, ఆ రోజు క్రూడాయిల్‌ ధర ఇంకా చాలా తక్కువ ఉందని చెప్పారు. ప్ర‌స్తుతం ముడిచమురు ధర తక్కువ ఉన్నప్పటికీ పెట్రోల్‌ ధరలు పెంచారని విమర్శించారు. ఆయిల్‌ సబ్సిడీలు ఎత్తివేసి రూ.23 లక్షల కోట్లు కూడబెట్టుకున్నారని తెలిపారు. డ్వాక్రా మహిళలు, రైతులకు ఒక్క రూపాయి రుణమాఫీ చేయలేదు కానీ రూ.11 లక్షల కోట్ల కార్పొరేట్‌ రుణాలు మాఫీ చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజా ఉద్యమాలకు మోదీ ప్రభుత్వం లొంగక తప్పదన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతరం పోరాడుతామని, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వం పై భవిష్యత్తు లో ప్రజా ఆగ్రహం తప్పదు అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, మారబోయిన రాజు యాదవ్, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, గౌతమ్ గౌడ్, టీఆర్ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, మహిళ నాయకులు, వార్డు మెంబర్లు, ఏరియా కమిటీ మెంబర్లు, టీఆర్ఎస్‌ పార్టీ అనుబంధ సంఘాల కమిటీ ప్రతినిధులు, మహిళలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here