మెగా మెడిక‌ల్ క్యాంపును ప్రారంభించిన కార్పొరేట‌ర్ హ‌మీద్ ప‌టేల్‌

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లిః టీఆర్ఎస్ ప్ర‌భుత్వ హ‌యాంలో పేద ప్ర‌జ‌ల‌కు మెరుగైన వైద్య స‌దుపాయాలు క‌ల్పించ‌డం జ‌రుగుతుంద‌ని, బ‌స్తీ ద‌వాఖానాల‌తో మంచి వైద్యం అంద‌జేస్తున్నామ‌ని కొండాపూర్ డివిజ‌న్ కార్పొరేట‌ర్ హ‌మీద్ పటేల్ అన్నారు. రాష్ట్ర పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్‌, ప్ర‌భుత్వ‌విప్‌, ఎమ్మెల్యే ఆరెక‌పూడి గాంధీ ఆధ్వ‌ర్యంలో కొండాపూర్ డివిజ‌న్ ప‌రిధిలోని అంజ‌య్య న‌గ‌ర్ సగ‌ర సంఘం భ‌వ‌నంలో ఏర్పాటు చేసిన‌ ఉచిత మెగా మెడిక‌ల్‌ క్యాంపును స్థానిక కార్పొరేట‌ర్ హ‌మీద్ ప‌టేల్ ప్రారంభించారు. పేద ప్ర‌జ‌ల ఆరోగ్య ప‌రిర‌క్ష‌ణ‌లో భాగంగా ఇలాంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయ‌డం అభినంద‌నీయ‌మ‌ని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో సగర సంఘం అధ్యక్షుడు ఆంజనేయులు సాగర్, టీఆర్ఎస్‌ డివిజన్ అధ్యక్షులు అబ్బుల కృష్ణ గౌడ్, జనరల్ సెక్రటరీ పేరుక రమేష్ పటేల్, సెక్రటరీ జె. బలరాం యాదవ్, టీఆర్ఎస్‌ సీనియర్ నాయకులు నరసింహా సాగర్, జంగంగౌడ్, రవి శంకర్ నాయక్, పి. రామకృష్ణ, గ్రేటర్ సగర సంఘం అధ్యక్షుడు మోడల రవి సాగర్, గ్రేటర్ యువజన సగర సంఘం అధ్యక్షులు ఏ. సీతారామసాగర్, యువజన సగర సంఘం అధ్యక్షులు సాయిబాబు సాగర్, డి తిరుపతి సాగర్, బాల స్వామి సాగర్, సాయి శామ్యూల్ కుమార్, టిమ్స్ హాస్పిటల్ డాక్టర్స్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


అంజ‌య్య న‌గ‌ర్‌లో ఏర్పాటు చేసిన ఆరోగ్య వైద్య శిబిరంలో పాల్గొన్న కార్పొరేట‌ర్ హ‌మీద్ ప‌టేల్‌
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here