నమస్తే శేరిలింగంపల్లిః భగత్ సింగ్ పోరాట స్ఫూర్తితో యుద్దాలు లేని సమాజాన్ని నిర్మిద్దామని, ఒక దేశం పై మరో దేశం చేసే ఆధిపత్యాన్ని, సామాన్య పౌరులను నష్టపరిచే యుద్ధాలను వ్యతిరేకిస్తూ యువత పోరాటాలు చేయాలని ఏఐఎప్‌డీవై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వనం సుధాకర్ అన్నారు. భగత్ సింగ్, రాజ గురు, సుఖ దేవ్ ల 91వ వర్ధంతిని పురస్కరించుకుని ఏఐఎప్‌డీవై ఆధ్వర్యంలో ఎం ఏ నగర్ లో వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ ల చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. గ్రేటర్ హైదరాబాద్ కన్వీనర్ డి. మధుసూదన్ మాట్లాడుతూ నాడు భగత్ సింగ్ లాంటి ఎందరో యువకులు దేశ స్వాతంత్రం కోసం పోరాడుతూ బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా గర్జించారని అన్నారు. నేటి యువత కులమతాలకు వ్యతిరేకంగా పోరాడుతూనే సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ పాలక వర్గాల వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని సూచించారు. ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్ ల యుద్ధాలు ఆపివేయాలని ప్రపంచ శాంతి ని నెలకొల్పాలని ఆయన కోరారు. ఏఐఎఫ్ డీఎస్ అధ్యక్షుడు పల్లె మురళి మాట్లాడుతూ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ దేవ్ లు అతి చిన్న వయసులో దేశం కోసం ప్రాణాలర్పించి నేటి తరాలకు పోరాట స్ఫూర్తిని నెలకొల్పారని తెలిపారు. రాజ్యాంగపరంగా విద్య, వైద్యం, కూడు, గూడు అందరికీ ఉచితంగా అందాలనే పోరాటాలను మరింత బలోపేతం చేస్తూ భగత్ సింగ్ స్ఫూర్తితో వాటిని సాధించుకోవడానికి ప్రజలందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఏఐఎఫ్‌డీవై గ్రేటర్ హైదరాబాద్ కమిటీ సభ్యులు కె. శరీష్, ఏఐఎఫ్‌డీడబ్య్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంభం సుకన్య, గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి ఏ. పుష్ప, ఏఐఎఫ్‌డీవై గ్రేటర్ హైదరాబాద్ యువతుల విభాగం కన్వీనర్ ఎండి సుల్తానా, సభ్యురాలు డి కీర్తి, దార లక్ష్మీ, సభ్యులు డి శ్రీనివాసులు, కె రాజు, బి రవి, శ్రీలత, పవన్, చొక్కం తదితరులు పాల్గొన్నారు.