నమస్తే శేరిలింగంపల్లి: బడుగు బలహీన వర్గాల కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు పథకాలను ప్రవేశపెట్టడం జరుగుతుందని బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ అన్నారు. మాదాపూర్ డివిజన్ బిక్షపతి నగర్ లో బడుగు బలహీన వర్గాల కోసం ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కార్డ్, ఈ -శ్రమ్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఏర్పాటు చేసిన సెంటర్ ను ప్రారంభించారు. బిజెపి నాయకులు రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉచితంగా 5 లక్షల రూపాయల బీమాతో కూడిన ఆయుష్మాన్ హెల్త్ కార్డ్ అర్హులకు ఇస్తుందని అన్నారు. దేశ వ్యాప్తంగా వేలాది నెట్‌వర్క్ హాస్పిటల్స్ లో ఈ పథకం వర్తిస్తుందని అన్నారు. దేశంలోని ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు రూ. 5 లక్షల ఆరోగ్య బీమా ఉంటుందన్నారు. రూ. 15 వేల ఆదాయం మించని ప్రతి కార్మికుడు ఈ-శ్రమ్ కార్డు పొందవచ్చని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ కేంద్ర ప్రభుత్వ పథకాలను పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాధాకృష్ణ యాదవ్, జంగయ్య యాదవ్, హరికృష్ణ, టి.వి మదనాచారి, వినయ్ బాబు, శ్రీనివాస్ రెడ్డి, సత్యం చారి, శ్రీధర్ మరియు మహిళా నాయకులు పద్మ, శిరీష రెడ్డి, స్వప్న, రేణుక తదితరులు పాల్గొన్నారు.